సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు.
తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్న ఎంపీ లక్ష్మణ్ బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.పది జిల్లాలను 33 జిల్లాలు చేశారన్నారు.
కానీ కొత్త వ్యవస్థకు సరిపడా ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు నిరుద్యోగులు సిద్ధంగా లేరని చెప్పారు.ఈ క్రమంలో యువతకు కొలువులు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని తెలిపారు.
అటు కర్ణాటకలో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.







