రాబోయే ఆపదను ముందు గుర్తించి దానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను మించిన వారెవరు ఉండరు.ఆ ముందు చూపుతోనే రాజకీయ వ్యూహలు రూపొందిస్తూ, రెండుసార్లు టిఆర్ఎస్ ను అధికారంలోకి వచ్చేలా చేసుకోగలిగారు.
మూడోసారి అదేవిధంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనికోసం కేంద్ర అధికార పార్టీ బీజేపీని టార్గెట్ చేసుకున్నారు.
గత కొంత కాలంగా టిఆర్ఎస్ పై బీజేపీ ఘాటుగా విమర్శలు చేస్తోంది .తెలంగాణ కు బీజేపీ అన్యాయం చేస్తోందనే విమర్శలు చేస్తూనే, కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మరింత పెంచే విధంగా టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది .ఇప్పుడు మరో ముందడుగు కేసీఆర్ వేశారు.
బీజేపీపై పోరాడేందుకు సమస్యల వారీగా జాయింట్ యాక్షన్ కమిటీ ల నియామకం చేపట్టాలని నిర్ణయించారు .ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.కాజీపేటలోని రైల్వే కోచ్ కర్మాగారాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ తో పాటు, మిగిలిన పార్టీ నేతలతో కలిసి సాధన సమితి ని ఏర్పాటు చేశారు.
దీని ద్వారా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.ఇక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ యూనిట్ ను మళ్లీ ప్రారంభించాలని, సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి కేంద్రంపై ఉద్యమించేందుకు నిర్ణయించారు.
అలాగే మాజీ మంత్రి జోగు రామన్న సైతం అందరిని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు .
బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇదే మాదిరిగా పోరాటం చేయాలని నిర్ణయించారు.ఇదే విధంగా ముందు ముందు అనేక సమస్యలపై ఎక్కడికక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ లను నియమించి బిజెపి పై మరింత ఒత్తిడి పెంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట.ఈ విధంగా కేంద్రంపై అన్ని రకాలుగా ను ఒత్తిడి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నారు.