కేంద్రాన్ని కేసీఆర్ ఇలా ఢీ కొట్టేస్తారా ?

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ జోరు పెంచారు.తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదని,  బీజేపీ మాత్రమే అనే విషయాన్ని ఆయన గుర్తించారు.

మెల్లిమెల్లిగా బిజెపి తెలంగాణ లో బలం పెంచుకుంటున్న తీరు, దుబ్బాక,  హుజురాబాద్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.  కేసిఆర్.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని , అందుకే ఇప్పటి నుంచే బీజేపీ ప్రభావం పెరగకుండా కెసిఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్ బీజేపీని పూర్తిగా టార్గెట్ చేసుకోవడం ద్వారానే తెలంగాణలో టిఆర్ఎస్ కు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని,  ప్రభుత్వంపై వ్యతిరేకతను బిజెపి వైపు మళ్ళించే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

 అందుకే రైతు సమస్యల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు.తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనంటూ కేసీఆర్ పట్టు పడుతున్నారు.

Advertisement

కెసిఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలకు పాల్పడుతున్నారని,  బిజెపి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పి కొడుతున్నారు.తనది ఫామ్ హౌస్ కాదని ఫార్మర్ హౌస్ అని, బిజెపి ని ప్రశ్నించిన వారు దేశద్రోహులు ఎలా అవుతారని కెసిఆర్ ప్రశ్నిస్తున్నారు.

తమకు తెలంగాణ ప్రజలు బాస్ అవుతారని ఇంకెవరూ కాదు అని కెసిఆర్ బిజెపి ఫై ఫైర్ అవుతున్నారు.పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బిజెపిని ఇరుకున పెట్టే విధంగా కెసిఆర్ వ్యవహారాలు చేస్తున్నారు.

ఇక ప్రతి సమస్య పైన బిజెపిని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.బిజెపితో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా మళ్లీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన కంపెనీ జమున హెచరీస్ కు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఇందులో భాగంగానే అన్నట్టుగా కనిపిస్తున్నాయి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు