హైదరాబాద్ లో హోంగార్డు రవీందర్ మృతిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు.రవీందర్ మృతికి కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.
హోంగార్డులకు సకాలంలో జీతాలు చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని బండి సంజయ్ తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కేసు నమోదు చేయాలని వెల్లడించారు.
అదేవిధంగా రవీందర్ ను వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.మృతుడు రవీందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా సరైన సమయంలో వేతనాలు ఇవ్వని కారణంగా గత మూడు రోజుల కిందట హోంగార్డు రవీందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.







