జనవరి 18వ తేదీన టిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి.మొత్తం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరుకానున్నారు.
పంజాబ్ సీఎం భగవత్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయ్ విజయన్ తో పాటుగా యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సభకు హాజరుకానున్నాడు.
అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు ప్రముఖ నాయకులకు కేసీఆర్ ఆహ్వానం పంపించాడు.
ఈ సభకు కనీసం ఐదు లక్షల మంది రావాలి అన్నది లక్ష్యం.ఏపీ అధ్యక్షులైన తోట చంద్రశేఖర్ కు ఇప్పుడు కొత్త టార్గెట్ వచ్చేసింది.
తన మొదటి అసైన్మెంట్ లోనే ఈ ఐదు లక్షల మందిలో కేవలం ఏపీ నుండి లక్ష మందిని తీసుకొని రావాలని టార్గెట్ ఇచ్చేసారట తెలంగాణ నుండి నాలుగు లక్షల మంది రావచ్చన్నది వారి అంచనా.

ఇక ఏపీ నుండి లక్ష మంది వచ్చేందుకు ఆర్థికంగా సహాయం అవసరమైతే అది కూడా అందుతుందని టిఆర్ఎస్ పెద్దలు హామీ ఇవ్వడంతో తోట అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.కానీ ప్రస్తుతానికి ప్రజలు ఆ బహిరంగ సభకు వచ్చేందుకు వారి కళ్ళ ముందు తోటా చంద్రశేఖర్, రావెల కిషోర్ తప్ప ఇంకెవరు కనిపించడం లేదు.

ఇక వీరిద్దరికీ కూడా లక్షల మందితో సభ నిర్వహించిన అనుభవం లేదు.అలాగే లక్షల మందిని పోగేసి సభకు తీసుకువచ్చిన రికార్డు లేదు.కెసిఆర్ ఇచ్చిన తొలి ఛాలెంజింగ్ టార్గెట్ ను వీరు ఎంత మాత్రం సాధిస్తారు అన్నది అనుమానమే.
ఇక ఖమ్మం జిల్లా సమీపంలో తోట చంద్రశేఖర్ కు ఏమైనా పట్టు ఉందా అంటే అది కూడా లేదు.ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాలలో పెద్దగా చురుకుగా లేరు స్థానిక నేతలతో సంబంధాలు సరిగ్గా లేవు.
ఇక లక్ష మందిని తీసుకొని వెళ్లడం అసాధ్యమే అని పలువురు చెబుతున్నారు.







