తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సిఎం కేసిఆర్( CM KCR ) తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూతున్నారాయన.
అయితే ఈసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో( Congress parties ) గట్టి పోటీ నెలకొనే అవకాశముండడంతో గెలుపు విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు సిఎం కేసిఆర్.ముఖ్యంగా అభ్యర్థుల ఎంపీక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఈసారి ఎన్నికల బరిలో 50 శాతం కొత్తవారికే ఛాన్స్ ఇవ్వబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆయన పోటీ చేసే స్థానం కూడా మారబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి.
కానీ తాజా సమాచారం మేరకు పాతవారి వైపే కేసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు టాక్.కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం వల్ల పాత వారినుంచి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.దీనికి తోడు బిఆర్ఎస్ ను నేతలను ఆకర్షిచేందుకు ప్రత్యర్థి పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏమాత్రం పార్టీలో అసంతృప్తి పెరిగిన ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంది.అందుకే దాదాపు 80 శాతం వరకు పాతవారికే ఛాన్స్ ఇచ్చే విధంగా కేసిఆర్ ప్రణాళికలు రచిస్తున్నారట.
ఇక మిగిలిన 20 శాతం మంది ఎమ్మెల్యేల విషయం మార్పు తప్పదని భావిస్తున్నారట.ఆ మద్య కొంతమంది ఎమ్మేల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా కేసిఆరే హెచ్చరించారు.అలా నియోజిక వర్గాల వారీగా అవినీతి ముసుగులో ఇరుకున్న 20 ఎమ్మెల్యేలను నిరభ్యంతరంగా పక్కన పెట్టబోతున్నట్లు టాక్.ఇక బరిలో నిలిచే అభ్యర్థుల మొదటి లిస్ట్ ను ఈ నెల 17 న ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్.
కేసిఆర్ లిస్ట్ లో ఉండే గెలుపు గుర్రాలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.అటు ప్రస్తుతం ఉన్న్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తమకు సీటు దక్కుతుందా లేదా అనే భయం కనిపిస్తోందట .మరి గెలుపే లక్ష్యంగా ప్లాన్స్ రెడీ చేస్తున్న గులాబీ బాస్ కు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.