ఒక్క లైన్ తో కాంగ్రెస్‌ను అక్క‌డికే ప‌రిమితం చేసేసిన‌ కేసీఆర్‌..?

దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు కేసీఆర్.వ్యూహాలు, మాటలతో ప్రజలను తనవైపుకు తిప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.

 Kcr Didn't Criticize Congress, Congress Party,munugode,cm Kcr,revanth Reddy,bjp,-TeluguStop.com

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి చమత్కారంతో కూడిన వ్యంగస్ట్రాలు ప్రత్యార్థులపై వేస్తూ ప్రధాన భూమిక పోషిస్తాడు.ఇక ఆయనకు కోపం వస్తే మాత్రం అయన మాటల తూటాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.

తాజాగా మునుగోడు ఎన్నికల వేళ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు కేసీఆర్.ఫైనల్ పరీక్షలకు సిద్దమౌతున్న వేళ ప్రీఫైనల్ పరీక్షల మార్కుల ఆధారంగా ఫైనల్ పరీక్షల మార్కులు వేస్తే విద్యార్థులకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఇప్పుడు బీజేపీ పై చూపిస్తున్నాడు కేసీఆర్.

తిట్టడంలో కాంగ్రెస్ ను సింగిల్ లైన్ కే పరిమితం చేసిన కేసీఆర్ :

మునుగోడు ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు.మరిన్ని నెలల సమయం పట్టే ఆస్కారం ఉంది.

తాజాగా కేసీఆర్ మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి బీజేపీపై నిప్పులు చేరుగుతున్నాడు.తమకు మొదటి శత్రువు బీజేపీ అన్నట్లు అయన ప్రసంగం కనిపిస్తుంది.

బీజేపీకి మునుగోడులో ఇప్పటివరకు డిపాజిట్లు రాలేదన్న కేసీఆర్ ఆ పరిస్థితి ఉంటే ఇంతలా సభ ఎందుకు పెట్టడన్నా చర్చ జరుగుతుంది.

Telugu Bandi Sanjay, Cm Kcr, Congress, Kcrcriticize, Munugode, Revanth Reddy, Te

నిజానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీట్ రాజగోపాల్ రెడ్డి రాజీనామతో బీజేపీ బలపడే ఆస్కారం ఉంది.ఇప్పుడు కేసీఆర్ కు విజయం కావాల్సిన అవసరం ఏర్పడడంతో బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నాడు.కానీ కాంగ్రెస్ ను మాత్రం ఒక్కమాట కూడా అనడం లేదు కేసీఆర్.

మునుగోడులో కాంగ్రెస్ ను సింగిల్ లైన్ మాత్రమే విమర్శించాడు కేసీఆర్.ఎక్కడ ఘాటు విమర్శలు చేయలేదు.

తనను తరుచు తిట్టే రేవంత్ రెడ్డిని కూడా ఒక్కమాట అనలేదు అయన.కాంగ్రెస్ పార్టీ తమకు ఎలాంటి పోటీ కాదని కేసీఆర్ విశ్వాసిస్తున్నాడట.అయన ప్రసంగం చుసినవారు అయన కాంగ్రెస్ ను ఇగ్నోర్ చేశాడు అంటున్నారు.పరిస్థితులకు అనుగుణంగా స్పీచ్ మార్చుకునే సత్తా కేసీఆర్ దగ్గర ఉందని అందుకే అయన కాంగ్రెస్ ను ఒక్కమాట అనలేదని అందరు అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube