తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్న రిజల్ట్స్ బీఆర్ఎస్( BRS ) శ్రేణులకు ఆందోళన కలిగిస్తున్నాయి.ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ లో వెళ్లడైంది.
బలపడినట్లుగా కనిపిస్తుండడం, సర్వేలన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తేల్చేయడంతో, బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది.దీంతో బీ ఆర్ ఎస్ శ్రెనులంతా సైలెంట్ అయిపోయారు .దాదాపు ఓటమి ఖాయం అనే అభిప్రాయానికి వచ్చేశారు.ఇక టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులలోను ఇదే విధమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి .చాలామంది అభ్యర్థులు ఓటమి భయంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.మరికొంతమంది కౌంటింగ్ ఏజెంట్ల నియామకం విషయంలోనూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ కచ్చితంగా మనమే ఈ ఎన్నికల్లో గెలవబోతున్నామని, ఎగ్జిట్ పోల్స్( Exit polls ) ను చూసి కంగారు పడవద్దని , అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయని , ఇప్పుడూ అదే జరుగుతుందని , కచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే అనేక మంది కీలక నేతలు కేసీఆర్ ను కలిశారు.ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ సరళి , ఎన్నికల రిజల్ట్ తదితర అంశాలపై చర్చించారు.
ఇక కౌంటింగ్ విషయంలో అభ్యర్థులు అంత సీరియస్ గా లేకపోవడాన్ని గుర్తించిన కేసీఆర్ కౌంటింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మారిపోతుందని తెలిస్తే, రావాల్సిన సీట్లు కూడా రావేమో అన్న ఉద్దేశంతో .కచ్చితంగా అంతా కౌంటింగ్ సెంటర్లకు వెళ్లాలని బిఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.కచ్చితంగా ఎన్నికల్లో ఓటమి తప్పదని బీఆర్ఎస్ కేడర్ అంతా బలంగా నమ్ముతుండగా, కెసిఆర్ , కేటీఆర్( KCR, KTR ) వంటి వారు మాత్రం మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తూ, పార్టీ క్యాడర్ కు ధైర్యం చెబుతున్నారు.