Lok Sabha elections KCR : లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ రెండో జాబితా ప్రకటించిన కేసీఆర్..!!

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందటంతో పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ).చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటి బీఆర్ఎస్ పరువు నిలబెట్టాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం వరంగల్ లోక్ సభ పరిధిలోని ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో.లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య పేర్లను వెల్లడించారు.ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar )ఇటీవలే టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.

Advertisement

గత లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ గెలిచారు.అంతకుముందు 2015 ఉప ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.కాగా వచ్చే లోక్ సభ ఎన్నికలకి సంబంధించి తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించారు.

ఖమ్మం నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు( Nama Nageswara Rao ), మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌( Koppula Eshwar )ను పేర్లను ఇదివరకే ఖరారు చేశారు.బుధవారం మరో రెండు పేర్లు ఖరారు చేయటంతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి మొత్తం ఆరుగురి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు