కవిత ధైర్యానికి సలాం !

మద్యం కుంభ కోణం లో ఆమె పాత్ర ఉందా లేదా ఉద్దేశపూర్వకం గా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం ఈడీ ని ప్రయోగించిందా అన్న విషయాలను కాసేపు పక్కన పెడితే ఆమె విచారణను ఎదుర్కొంటున్న విధానం మాత్రం అభినందనీయం ఈరోజు అరెస్ట్ చేస్తారు రేపు కచ్చితంగా చేసేస్తారు అన్న అంచనాల మధ్య ప్రతిరోజు గంటలు గంటలు జరుగుతున్న విచారణను దైర్యం గా ఎదుర్కోవటం తిరిగి నవ్వుతూ వెనక్కి రావటం చూస్తూ ఉంటే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న వ్యక్తిత్వ వికాస పాఠం చూస్తున్నట్టుగా ఉంది.

 Kavitha Facing Ed With Grate Ease, Kavitha , Ed  , Brs , Bjp, Media ,narendra Mo-TeluguStop.com

Telugu Kavitha, Narendra Modi, Supreme-Telugu Political News

తలపండిన రాజకీయ నాయకుల సైతం ఈడీ నోటీసులు( ED ) అంటే ఉలిక్కి పడుతుంటారు.లాలూ ప్రసాద్ యాదవ్ జయలలిత వంటి అగ్ర నాయకులు సైతం విచారణ సంస్థల బారిన పడి తమ ఆరోగ్యాన్ని అధికారాన్ని కోల్పోయిన సంఘటనలు మనం చూసాం.జయలలిత విషయంలో అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె శిక్ష పడిన సంఘటనలు కూడా జరిగాయి.

మోడీకి ( Narendra Modi )ప్రత్యామ్నాయం తామే అంటూ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ మరొక ఆరు రాష్ట్రాల్లో ప్రభావం చూపించే ఓటు బ్యాంకు ఉన్న కేజ్రివాల్ కూడా ఈ మద్యం కుంభకోణం విషయం లో ఎలా బయటపడాలో అర్దం కాక తలబద్దలు కొట్టుకుంటున్నారు అలాంటిది ఈడీ అధికారులని కంగుతినిపించేలా ప్రవర్తిస్తున్న కవిత ప్రవర్తన వెనక ఉన్న ధైర్యం ఏమిటో అంటూ కొంతమంది విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

Telugu Kavitha, Narendra Modi, Supreme-Telugu Political News

వీడి విచారణపై సుప్రీంకోర్టుకు( Supreme court ) వెళ్లడం వరకు అందరూ చేసే పనే అయినా ఈడీ ఇస్తున్న స్టేట్మెంట్లని తప్పని నిరూపించడానికి మీడియాకెక్కడం నిజంగా ఆమె ధైర్యాన్ని సూచిస్తుంది తన పది ఫోన్లను కవిత ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని అందులో ఉన్న ఆధారాలను మాయం చేయడానికే ఆమె ఈ పనికి పూనుకున్నారంటూ ఈడి ఉద్దేశపూర్వకంగానే మీడియాకు లీకులు ఇచ్చింది.అయితే ఇప్పుడు ఈడి స్టేట్మెంట్లు తప్పని రుజువు చేయడానికి ఆ మీడియాని ఆమె తన పాత ఫోన్లు అన్నిటిని మీడియా ముందు ప్రదర్శనకు పెట్టారు.దీని ద్వారా ఈడీ విచారణ సహితకంగా జరగట్లేదు అన్న అనుమానాలు సాధారణ జనంలో కూడా వచ్చేలా చేయడం లో ఆమె విజయం సాదించారు.

ఈడీ ఆమెను ఒత్తిడికి గురి చేయడం కాదు ఆమె తిరిగి వీడియా అధికారులను ఒత్తిడికి గురవేలా చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా కేసీఆర్ వారసురాలు కాబట్టి ఆ దైర్యం స్వతహా గానే వచ్చిందంటూ గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube