లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయినా కవిత( K Kavitha ) ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు.ఇదే సమయంలో అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
అరెస్టు అయినా సమయంలో కొడుకుని పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు.కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి ముందుకు సాగారు.
అంతకుముందు జై తెలంగాణ అని నినాదించి ఆమె పిడికిలి బిగించి శ్రేణులకు అభివాదం చేశారు.అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకుని కవిత భావోద్వేగానికి గురయ్యారు.
మరోవైపు కార్యకర్తలు కవిత అరెస్టును అడ్డుకోవద్దని, సంయమనం పాటించాలని కేటీఆర్, హరీష్ రావులు కోరారు.
కాగా సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈడీ దాడులు చేయటం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ బీజేపీ( BJP ) నాయకుల ఆధ్వర్యంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించడం జరిగింది.ఇక ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ రేపు సుప్రీంలో కవిత చాలెంజ్ పిటీషన్ వేయనున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్లైట్ లో కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు.సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు కావటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.