బాలీవుడ్ సినిమా కోసం ప్రభాస్ తో జోడీ కడుతున్న కత్రినా కైఫ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఓ వైపు రాధేశ్యామ్ మూవీ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.

 Katrina Kaif Romance With Prabhas, Tollywood, Adi Purush Movie, Bollywood, Salaa-TeluguStop.com

మరో వైపు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ షూటింగ్ జరుగుతుంది.అలాగే సలార్ షూటింగ్ కూడా ఇప్పటికే మొదలు పెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు.

రెండో షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జరిగిపోయాయి.అది పురుష్ మొత్తం స్టూడియోలోనే కావడంతో గ్యాప్ ఇవ్వకుండా చిత్రీకరణ జరుపుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ అ సినిమా షూట్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది.ఈ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతున్నాడు .ఆ సినిమా యూనివర్షన్ రేంజ్ లో తెరకెక్కుతుంది.

ఇండియన్ బాషలతో పాటు ఇతర విదేశీ బాషలలో కూడా ఆ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే వీటి తర్వాత సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రభాస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కాని భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం అప్పుడే దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కత్రినా కైఫ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా కత్రినా కైఫ్ మారింది.

ఇక ప్రభాస్ కి కూడా ఈమె పెర్ఫెక్ట్ జోడీగా ఉంటుందని దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ భావించి ఎంపిక చేసినట్లు బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube