ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన, విన్నా కూడా లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ వివాహం సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.గత కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట డిసెంబర్ 9న ఒక్కటయ్యారు .
వీరి పెళ్లి రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వారాలో జరిగింది .ఇక తాజాగా బుధవారం సాయంత్రం హల్దీ వేడుక ముగియగా, అనంతరం సంగీత్, డిసెంబర్ 9న గురువారం మధ్యాహ్నం ఈ జంట ఏడడుగులు వేసి ఒకటయ్యారు.
పెళ్లి తర్వాత రిసెప్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు.వెడ్డింగ్ ప్లానర్ లు ముఖ్య అతిథుల కోసం 8 నుంచి 10 టెంట్ లను బుక్ చేశారట.వీటికి రాత్రికి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందట.అయితే వీరి వివాహానికి కేవలం బాలీవుడ్ సెలబ్రెటీలు వీవీఐపీలు మాత్రమే కాకుండా కార్పొరేట్ దిగ్గజాలు అయినా ముఖేష్ అంబానీ కుటుంబం, అతని సోదరుడు అనిల్ అంబానీ కుటుంబం కూడా ముఖ్య అతిథులుగా హాజరు అయినట్లు సమాచారం.
ఒబేరాయ్ హోటల్ లో వారికోసం ఐదు గదులు కూడా రిజర్వు చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ పెళ్లికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఈ వివాహానికి వచ్చారని తెలుస్తోంది.వీటితో పాటుగా నేహా దూపియా, అంగద్ బేడీ దంపతులు, కబీర్ ఖాన్, భార్య మినీ మాథుర్, శార్వారి బాగ్, రోహిత్ శెట్టిలు హాజరయ్యారు.సాధారణంగా సెలబ్రిటీలకు వివాహ ఫుటేజీలో ఫోటోలను మ్యాగజైన్లకు కొన్నిసార్లు విక్రయించడం ట్రెండింగ్ గా ఉంది.
ఈ క్రమంలోనే స్ట్రీమింగ్ దిగ్గజం పింక్ విల్లా పెళ్లికి సంబంధించిన ఫుటేజ్ హక్కుల కోసం కత్రినా కైఫ్,విక్కీ కౌశల్ కు ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.







