పవన్ కళ్యాణ్ సినిమాని ఇంత పిచ్చిగా ప్రేమిస్తారా ?

సినిమా అంటే ఇష్టం ఉండడం వేరు.సినిమాలో నటించడం వేరు.

 Karunakaran About Pawan Kalyan Tholiprema Facts Detals, Pawan Kalyan, Tholi Prem-TeluguStop.com

కానీ సినిమా అంటే పిచ్చి ఉండడమే కొంతమందిని స్టార్ హీరోలను చేస్తుంది.అంతకన్నా మంచి క్రియేటర్ ని చేస్తుంది.

కచ్చితంగా అలాంటి వారిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందుంటాడు.అతనికి సినిమా అంటే పిచ్చి.

ఎంత పిచ్చి అంటే తను కెరియర్ లో ఎంతో ఇష్టంగా చేసిన సినిమా తొలిప్రేమ.( Tholi Prema Movie ) దానికోసం ఎవరు చేయని చాలా పనులను పవన్ కళ్యాణ్ చేశారు.

ముఖ్యంగా తన సీన్ లేకపోయినా కూడా ఆ సినిమా కథ బాగా నచ్చడంతో షూటింగ్ లో కూర్చొని ఉండేవాడట.అలా సరదాగా సెట్స్ కి వచ్చే ప్రతిరోజు కూర్చోనే వాడట.

సినిమా ఎలా వస్తుంది అని గమనిస్తూ ఉండేవాడట.అప్పటికే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అయినా కూడా ఎలాంటి ఈగో లేకుండా ఆ సినిమా కోసం అహర్నిశలు కష్టపడేవాడట.

తొలిప్రేమ సినిమాలోని చాలా సీన్స్ అన్న పాటలన్నా కూడా పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట.

Telugu Ee, Karunakaran, Pawan Kalyan, Pawankalyan, Tholi Prema, Tollywood-Movie

తొలిప్రేమ చిత్రంలో నీ మనసే అనే పాట పవన్ కళ్యాణ్ కి చాలా ఫేవరెట్ పాట.ఈ సినిమా ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక రోజు తనకు ఇష్టమైన పాట ఎడిటింగ్ జరుగుతుందని తెలుసుకుని రాత్రి 8 గంటల సమయంలో రామానాయుడు స్టూడియోకి( Ramanaidu Studio ) వచ్చారట.పవన్ కళ్యాణ్ అప్పటికే కరుణాకరన్( Karunakaran ) ఆ పాటను ఎడిటింగ్ చేస్తున్నారట.

ఒకసారి నాకు ఆ పాట చూపించు కరుణ అని అడిగారట పవన్ కళ్యాణ్.దాంతో టైం పడుతుంది పవన్ గారు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పారట.

అసలు పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారన్న విషయం మర్చిపోయి కరుణాకరన్ ఎడిట్ చేయిస్తునే ఉన్నాడట.రాత్రి మూడింటి వరకు ఎడిటింగ్ అయ్యిందట.అప్పుడు బయటకు వచ్చి చూసేసరికి ఒక బల్లపై పవన్ కళ్యాణ్ అలాగే కూర్చొని ఉండడం చూశారట.

Telugu Ee, Karunakaran, Pawan Kalyan, Pawankalyan, Tholi Prema, Tollywood-Movie

మీరు ఇంకా వెళ్లి పోలేదా అని కరుణాకర్ అడగగా ఆ పాట చూపిస్తే వెళ్ళిపోతాను.అయిపోయాక చూపిస్తాను అని చెప్పావు కదా అందుకే వెయిట్ చేస్తున్నాను అని అన్నాడట.దాంతో ఆ రాత్రి కూడా పాటను చూసి అద్భుతంగా వచ్చిందని కౌగిలించుకొని కరుణాకరన్ తో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పాడట.

అంతలా సినిమా అంటే పిచ్చి ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఈరోజుల్లో.అర నిమిషం ఆలస్యమైనా హడావిడి చేసే ఈ రోజుల్లో ఇలాంటి ఒక హీరోని చూసి కరుణాకరన్ పిచ్చివాడైపోయాడు.

జీవితంలో మళ్ళీ ఇలాంటి గొప్ప స్టార్ తో సినిమా తీయడం జరగదు అని అనుకున్నారట ఆరోజే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube