బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల( Nirupam Paritala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు నిరుపమ్.
మరి ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ( Karthikadeep serial )తో భారీగా క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.అయితే నిరుపమ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూనే నిర్మాతగా మారి సీరియల్స్ ని కూడా తెరకెక్కిస్తున్నారు.

కాగా ప్రస్తుతం నిరుపమ్ హీరోయిన్ నిత్యామీనన్( Nithya Menon ) తో కలిసి కుమారి శ్రీమతి( Kumari Srimathi ) అనే సిరీస్ లో నటిస్తున్నాడు.వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ ఈ సిరీస్‌ని 7 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
కాగా నిరుపమ్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేశారు.ఆ ప్రోమోలో నిరుపమ్ తన కెరీర్ స్టార్టింగ్, సినిమా అవకాశాలు, భార్య మంజులతో ప్రేమ, ఇలా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ప్రోమో చివరిలో.ఎన్టీఆర్‌ని ఒక విషయం అడగాలంటే ఏం అడుగుతారు? అని నిరుపమ్ ని విలేకరి ప్రశ్నించింది.దానికి బదులిస్తూ.పాలిటిక్స్‌లోకి త్వరగా రావాలి.ఏదోకటి చేయమని అడుగుతాను అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిరుపమ్ విజయవాడకి చెందిన కుర్రాడు కావడంతోనే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.







