బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంటుంది.
ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రేటిలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇందులో నటించే నటుల గురించి వారి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇందులో ఎక్కువగా దీప కోసం బాగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.అంతేకాకుండా వంటలక్క కూతురులుగా నటించిన హిమ, సౌర్య పాత్రలే కాకుండా అందరి పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఇక ఇప్పుడు సీరియల్ లో పాత్రలు పెద్దగా అయ్యారన్న విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఈ సీరియల్ మంచి రేటింగ్ తో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే చిన్నప్పుడు హిమ, సౌర్య పాత్రల్లో నటించిన చిన్నారులను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటూ ఉంటారు.ఇక వాళ్లు సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు టచ్ లో ఉన్నారు.
ఇక హిమ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సహృద. మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.ఇక సహృద ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.కానీ సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరలో ఉంది.
సహృద సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఫోటో షూట్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
అంతే కాకుండా తన డాన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.

సీరియల్ విరామ సమయంలో కూడా బాగా రీల్స్ చేసేది.ఇక అప్పుడప్పుడు బుల్లితెర ఈవెంట్లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.ఓసారి తన నిజ జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ కూడా అయింది.
ఇక ఇటీవల యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఓ ఛానల్ క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తన వ్యక్తిగత విషయాలతో పాటు మరెన్నో విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది.

తను షేర్ చేసుకునే వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.అంతే కాకుండా విపరీతమైన లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తాయి.అప్పుడప్పుడు తన ఇన్ స్టా ద్వారా తన అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో మరో వీడియో పంచుకుంది.
అందులో తను గోల్డ్ షాప్ లో ఉన్నట్లు కనిపించగా తన పుట్టినరోజు అని భారీగా బంగారం కొన్నది.
ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో.నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
మరికొందరు పుట్టినరోజుకే ఇంత షాపింగ్ చేస్తే పెళ్ళికి ఎంత చేస్తుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సహృద మంచి అభిమానం సంపాదించుకుంది.







