బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాధ్ అలియాస్ వంటలక్క గురించి అందరికీ సుపరిచితమే.ఈమె మలయాళ నటి అయినప్పటికీ తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఈమె తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో మాత్రమే నటిస్తున్నప్పటికీ మలయాళంలో మాత్రం పలు సీరియల్స్ లోనూ అలాగే ఫ్లవర్స్ టీవీ ఛానల్ లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.మలయాళంలో ఎంతో బిజీగా గడుపుతున్న వంటలక్క గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.
కార్తీకదీపం సీరియల్ లో పెద్దగా చదువుకోని అమ్మాయిల అమాయకంగా తన భర్త కోసం పోరాటం చేస్తూ ఉన్న దీప పాత్రలో కనిపించే వంటలక్క నిజ జీవితంలో లా చదివారట.ఈమె ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా చేస్తుందని సమాచారం.
ఇక ఈమె భర్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అని తెలుస్తుంది.ఆయన పేరు డాక్టర్ వినీత్ భట్.ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ అందుకున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈమె తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప వ్యక్తిగతంగా మాత్రం చాలా రిచ్ అని తెలుస్తోంది.
ఈమెకు కేరళలో ఏకంగా రెండు స్టూడియోలు ఉన్న విషయాన్ని ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

కేరళలో మలయాళ సినిమాలు సీరియల్స్ షూటింగ్ పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ స్టూడియోలోనే జరుగుతాయని ఈమె వెల్లడించారు.ఇలా స్టూడియోలతోపాటు ఖరీదైన ఇల్లు లగ్జరీ కార్లు ఉన్నట్టు తెలుస్తుంది.ఈ విధంగా ప్రేమి విశ్వనాథ్ బాగా రిచ్ అని ఈమెకు సుమారు వంద కోట్లకు పైగా ఆస్తుపాస్తులు ఉన్నట్లు సమాచారం.
వంటలక్క గురించి ఈ విషయాలు తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు వామ్మో వంటలక్క బ్యాగ్రౌండ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.