అలాంటప్పుడే వంగుతానంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్?

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్ధ పావు భాగ్యం అలియాస్ ఉమాదేవి తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి రెండవ వారంమే బయటకు వచ్చిన ఉమాదేవి ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఉమాదేవి తనకు తెలిసిన ఒక బోటిక్ ఓనర్ తో కలిసి లైవ్ లో యాడ్ చేసింది.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ గురించి ఎన్నో ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఉమాదేవి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో మానస్, సన్నీ ఇద్దరు ఎంతో నిజాయితీగా ఆట ఆడతారని, వీరిద్దరూ టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటారని నా మద్దతు వీరిద్దరికీ ఉందని ఉమాదేవి వెల్లడించారు.ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో చాలా మిస్ అవుతున్నాము మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ కామెంట్లు చేయగా వాటికి స్పందించిన ఉమాదేవి నేను చిన్నప్పటి నుంచి ఇలా ముక్కుసూటిగా మాట్లాడతాను.

నాకు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడటం రాదు.ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తానని తెలిపారు.

Karthika Deepam-bhagyam Fame Uma Devi On Bigg Boss 5 Telugu Contestants Vj Sunny

నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నేను ఒంగుతాను కానీ నా తప్పు లేకపోతే ఎవరికీ భయపడని ఈ సందర్భంగా ఉమాదేవి వెల్లడించారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండాలంటే ఎంతో కష్టపడాలని,టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా బిగ్ బాస్ విన్నర్స్ అంటూ ఈమె తెలియజేశారు.ఈ క్రమంలోనే హౌస్లో ఎవరైతే నిజాయితీగా ఆడతారో వారికి మాత్రమే ఓటు వేసి గెలిపించండి అంటూ మరోసారి అభిమానులను ప్రేక్షకులను కోరారు.

Karthika Deepam-bhagyam Fame Uma Devi On Bigg Boss 5 Telugu Contestants VJ Sunny
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు