సర్కారు వారి పాట తర్వాత గ్యాప్ తీసుకున్న పరశురాం గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాల్సి ఉన్నా దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండతో సినిమా ఎనౌన్స్ చేశాడు.అయితే అదే కాకుండా కోలీవుడ్ హీరో కార్తీతో కూడా సినిమా లైన్ లో పెట్టాడు పరశురాం.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తారని టాక్.ఈమధ్యనే కార్తీని కలిసి కథ వినిపించడం హీరో ఓకే అనడం జరిగిందట.
ఇక ఈ సినిమాకు లేటెస్ట్ గా టైటిల్ కూడా ఫిక్స్ చేశారని టాక్.సినిమాకు టైటిల్ గా రెంచ్ రాజు అని పెట్టారట.
మొన్న కథ చర్చలు జరగడం ఆలస్యం నేడు టైటిల్ కూడా బయటకు వచ్చేసింది.

కార్తీ కూడా తెలుగులో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు.కార్తీ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇప్పటికే అతను ఊపిరి సినిమాలో నటించాడు.
ఇక పరశురాం సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.కార్తీ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
రీసెంట్ గా ధనుష్ ఆల్రెడీ స్ట్రైట్ తెలుగు సినిమాతో సత్తా చాటగా కార్తీ కూడా అదే బాటలో ఇక్కడ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.







