అక్కడి ఫలితాలే ఇక్కడ మార్పు తెచ్చాయా ? 

రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరు ఊహించలేరు.కత్తులు తీసుకున్న పార్టీలు.

 Karnataka Elections Results Changes In Telangana Ts Politics, Bjp, Telangana, A-TeluguStop.com

కౌగిలించుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం.విమర్శలు చేసిన నోటితోనే పొగడ్తలు వర్షం కురిపించడం ఇక్కడ పరిపాటి.

అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది.ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బిజెపి మధ్య పొత్తుల వ్యవహారం తెరపైకి రావడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.

గతంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారిపై వ్యక్తిగత విమర్శలకు దిగిన టిడిపి అధినేత చంద్రబాబు గత కొంతకాలం నుంచి బీజేపీ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, అగ్ర నేతలను ప్రసన్నం చేసుకునే పనులు ఉన్నారు బిజెపితో( BJP ) పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తిరుగుండదని, ఏపీలో గెలిచేందుకు ఎన్నికల వ్యూహాలను బిజెపి అందిస్తుందని, ఏపీలో బిజెపికి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా, మిగతా విషయాల్లో తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో చంద్రబాబు ఉన్నారు.

Telugu Amithsha, Ap Bjp, Central, Chandrababu, Telangana, Telangana Bjp-Politics

 అందుకే బీజేపీతో పొత్తు కోసం అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith shah ) తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.పొత్తుల అంశంపై కీలకంగా చర్చించారు.

అయితే గతంలో బిజెపి పెద్దల అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు అపాయింట్మెంట్ దక్కేది కాదు.అయితే ఇప్పుడు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ దొరకడం , దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరగడం వంటివన్నీ చోటు చేసుకున్నాయి.

ఇదంతా కర్ణాటక ఎన్నికల ( Karnataka elections )ఫలితాల కారణంగానే అక్కడ బిజెపి ఓటమి చెందడంతో,  ఆ ప్రభావం మిగతా రాష్ట్రాల్లోనూ స్పష్టంగా ఉండబోతుందనే సంకేతాలతో బిజెపి కాస్త వెనక్కి తగ్గిందనే  వ్యాఖ్యలు  వినిపిస్తున్నాయి.అయితే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ టిడిపి మద్దతు తీసుకోవాలని ఆలోచనతో బిజెపి ఉందట.

ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఏపీలో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని విషయాన్ని తేల్చుకోబోతున్నారట.

Telugu Amithsha, Ap Bjp, Central, Chandrababu, Telangana, Telangana Bjp-Politics

అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అక్కడ బిజెపి శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలంటే మిగతా విషయాలను పక్కనపెట్టి తమకు కలిసి వచ్చే అన్ని మార్గాలను ఎదుర్కోవాల్సిందేనని ,టిడిపికి తెలంగాణలో ఉన్న ఓటు బ్యాంకు ను బిజెపి వైపు మళ్ళించగలిగితే బిజెపి విజయానికి తిర్గు ఉండదనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube