కర్ణాటకలో కూడా విజృంభిస్తున్న కరోనా,6 వేలకు చేరువలో

దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.దేశంలోని మహారాష్ట్ర,తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ కేసుల తీవ్రత మరింత పెరుగుతుంది.

 Corona Positive Cases, Corona, Karnataka, Covid-19, Lockdown Eases-TeluguStop.com

మార్చి,ఏప్రిల్ నెలలో కేవలం 4 వందలు,5 వందలుగా నమోదు ఆయిన కరోనా పాజిటివ్ కేసులు నేడు 6 వేలకు చేరువవడం ఆందోళన కలిగిస్తుంది.లాక్ డౌన్ విధించిన సమయంలో తక్కువగా కేసులు నమోదు అయిన కర్ణాటకలో సడలింపులతో ఈ కేసులు మరింత పెరిగిపోయాయి.
కేవలం కొద్దీ రోజుల వ్యవధిలోనే తీవ్ర స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది.కరోనా నియంత్రణలో ఉన్న సమయంలో షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తాము అంటూ ప్రకటించిన కర్ణాటక యడ్యూరప్ప సర్కార్ ఇప్పుడు కేసుల తీవ్రత పెరుగుతుండడం తో అయోమయంలో పడింది.

చైనా లో మొదలుకొన్న ఈ కోవిడ్-19 విజృంభిస్తోంది.ప్రపంచ దేశాలను వణికిస్తోంది.దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి.ప్రభుత్వాలు ఎంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత మాత్రం పెరుగుతూనే ఉంది.ఈ క్రమంలో కర్ణాటకలో కరోనా కేసులు 6వేలకు చేరువయ్యాయి.60మందికి పైగా మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరించింది.

వారు ఇచ్చిన వివరాల ప్రకారం.గత 24 గంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మరణించారని తెలిపింది.164 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారని వివరించింది.కాగా.

తాజాగా రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 5,921కి చేరాయని, వారిలో 3,248 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 2,605మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యరని వెల్లడించింది.అయితే 66 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube