ప్రియుడి మోజులో సొంత తమ్ముడిపై దారుణం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి నమ్మలేని నిజాలు..!

ఈరోజుల్లో వివాహ బంధాలకు, కుటుంబ బంధాలకు విలువ లేకుండా పోతోంది.కేవలం అక్రమ సంబంధానికి కట్టుబడి కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసి అడ్డు తొలగించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది.

 Karnataka Banashankari Crime News Sister Kills Brother , Boyfriend , Karnataka-TeluguStop.com

ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకుని భర్తకు విడాకులు ఇచ్చేసింది.కానీ అక్రమ సంబంధం గురించి సొంత తమ్ముడికి తెలియడంతో దారుణంగా హత్య చేసి, తనకేం తెలియనట్లు అమాయకంగా నటించింది.

ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే.

కర్ణాటకలోని ( Karnataka )బనశంకరి ప్రాంతంలో ఉండే భాగ్యశ్రీ కు చాలా సంవత్సరాల క్రితం వివాహమైంది.అయితే భాగ్యశ్రీ కు వివాహం కంటే ముందే సుపుత్రత శంకరప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.

వివాహం తర్వాత శంకరప్పకు దూరంగా ఉండలేక 2015లో భర్తకు విడాకులు ఇచ్చి, శంకరప్పతో అక్రమ సంబంధం( Affair ) కొనసాగిస్తోంది.ఈ అక్రమ సంబంధం గురించి భాగ్యశ్రీ తమ్ముడికి తెలియడంతో అక్కను గట్టిగా ప్రశ్నించాడు.

అసలు విషయం తమ్ముడికి తెలియడంతో భాగ్యశ్రీ కి ఏం చేయాలో అర్థం కాలేదు.తమ్ముడు ఎప్పటికైనా తన అక్రమ సంబంధానికి అడ్డే అని భావించి ప్రియుడుతో కలిసి తమ్ముడిని హత్య చేసి శరీర భాగాలను వివిధ ప్రాంతాలలో పడేసి చేతులు దులుపుకుంది.భాగ్యశ్రీ తమ్ముడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో( Police station ) ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఇక భాగ్యశ్రీ అప్పటినుండి ప్రియుడుతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ కు నివాసం మార్చింది.8 సంవత్సరాలుగా ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు భాగ్యశ్రీ, శంకరప్ప లపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ చేయగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో తామే హత్య చేశామని అంగీకరించారు.నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube