హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ కు హాజరైన కరాటే కళ్యాణి. కరాటే కల్యాణి మాట్లాడుతూ.
ఐదు నెలల చిన్నారిను దత్తత తీసుకోలేదు.నాకు కలెక్టర్ నుండి కానీ, CWC నుండి కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.
దత్తత వ్యవహారం పై కలెక్టర్ ను కలిసి వివరణ ఇచ్చాను.కానీ నేను ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, సంబంధిత అధికారుల నుండి సమాచారం తీసుకుంటాం అన్నారు.
ఈరోజు CWC అధికారులు లేక పోవడంతో రేపు విచారణకు పిలిచారు.
తన దగ్గర ఉన్న పాపను దత్తత తీసుకున్నట్లు శివ శక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తున్నారు.
నేను దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడింది వాస్తవమే.కానీ, నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఆ మాట చెప్పాను.కావాలనే నాపై కుట్ర చేసి, కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు.