టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమాలకు హద్దులు చెరిపేసాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాలు అటు సౌత్ లో ఎంత మంచి విజయాన్ని సాధిస్తుందో అటు బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది.
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు.కానీ ఇప్పుడు మాత్రం అక్కడి ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే ఇక పెద్ద సినిమాలన్నీటికీ కూడా బాలీవుడ్లో ప్రమోషన్స్ చేసేందుకు దర్శక నిర్మాతలందరూ బాలీవుడ్ స్టార్ దర్శకుడు నిర్మాత అయిన కరణ్ జోహార్ ని పట్టుకుంటున్నారు.
ముందుగా ఆయన అప్రోచ్ అవుతూ ఇక ఆయన ద్వారానే ప్రమోషన్స్ నిర్వహిస్తూ ప్రేక్షకులందరికీ తెలుగు సినిమాను కనెక్ట్ అయ్యేలా చేస్తూ ఉన్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలందరూ.
ఈ క్రమంలోనే బాలీవుడ్ పెద్దలు కూడా ఇలాంటి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జక్కన్న ఏదైనా ప్రెస్ మీట్ లో కనిపించాలంటే తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలకు టాలీవుడ్లో కూడా మార్కెట్ పెంచేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్నను ఆశ్రయిస్తున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు.

కాగా ఇటీవలే రణబీర్ కపూర్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. జూన్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా చేసేందుకు జక్కన్న తో కలిసి కరణ్ జోహార్ సౌత్ లో కూడా భారీగా ప్రమోషన్స్ చేసేస్తున్నాడు.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అటు బాలీవుడ్ మార్కెట్ పైనే కాదు సౌత్ మార్కెట్ పైన కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది.ఇక జక్కన్న సమర్పణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో రణబీర్ కపూర్, నిర్మాత కరణ్ జోహార్ కూడా నమ్ముతున్నారు.మరి ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.







