అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాపు నేతలు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలో శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాపు నేతలకు మధ్య చెలరేగిన వివాదం తోపులాటకు దారితీసింది.
ఈ క్రమంలో తీవ్ర అసహానికి గురైన కాపు నేతలు రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.