మరో రికార్డ్ బ్రేక్ చేసిన కాంతారా.. కెజిఎఫ్ ను మించిన క్రేజ్!

రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

చిన్న సినిమాగా వచ్చిన కన్నడ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో సత్తా చాటుతూ అందరి కళ్ళు ఆ సినిమా వైపుకు తిప్పుకుంటుంది.

ఈ చిన్న సినిమా విజయాన్ని చూసి అందరు ఈ సినిమా గురించే చర్చించు కుంటున్నారు.కాంతారా కన్నడ లోనే కాకుండా రిలీజ్ అయినా అన్ని చోట్ల రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది.

దీంతో అంతా ఈ సినిమాపై ప్రశంసలు అందిస్తున్నారు.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కన్నడలో కొత్త రికార్డులను నెలకొల్పుతుంది.

ఇక తాజాగా ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసినట్టు మేకర్స్ కొత్త పోస్టర్ ప్రకటించారు.అతి తక్కువ బడ్జెట్ తోనే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు.

Advertisement

కెజిఎఫ్ తర్వాత ఈ నిర్మాణ సంస్థ వరుస సినిమాలను నిర్మిస్తూ పాపులర్ అయ్యింది.కెజిఎఫ్ 2 తో భారీ లాభాలు అందుకున్న ఈ సంస్థ మరిన్ని సినిమాలను నిర్మిస్తుంది.

ఈ క్రమంలోనే చిన్న సినిమాగా కాంతారా సినిమాను నిర్మించింది.మరి తాజాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసినట్టు టాక్.కర్ణాటక లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కాంతారా సినిమా నిలిచిందని.

కెజిఎఫ్ 2 ను దాటి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అని టాక్.కెజిఎఫ్ సృష్టించిన అత్యధిక ఫుట్ ఫాల్స్ రికార్డ్ ను ఈ సినిమా అధిగమించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు