ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన కాంతార సినిమా కన్నడలోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది.తెలుగులో కూడా అల్లు అరవింద్ రిలీజ్ చేసిన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టించింది.
ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి కాంతార 2( Kantara 2 ) ఎనౌన్స్ చేశారు మేకర్స్.రిషన్ శెట్టి హీరో కం డైరెక్టర్ గా చేసిన కాంతార సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే 400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది.
ఇంతకన్నా మాస్ ర్యాంపేజ్ మరోటి ఉండదని చెప్పొచ్చు.

ఇక ఇప్పుడు కాంతార 2 కోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు.స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్న రిషబ్ శెట్టి( Rishab Shetty ) ఈ సినిమాకు భారీగా రెమ్యునరేషన్( Remuneration ) అడుగుతున్నాడని తెలుస్తుంది.కాంతార 1 కోసం 5 కోట్లు అది హీరోగా డైరెక్టర్ గా రెండు విభాగాలకు కలిపి తీసుకున్న రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ కు ఓ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారట.
ఎలాగు కాంతార 1 వందల కోట్లలో లాభాలు తెచ్చింది కాబట్టి సినిమా సీక్వెల్ కోసం రిషబ్ అడిగిన రెమ్యునరేషన్ ఇస్తున్నారట.కాంతార 2 కి రిషబ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
మొదటి పార్ట్ కి 5 కోట్లు తీసుకోగా సీక్వెల్ కి అది పాతిక రెట్లు పెరిగింది.రిషబ్ శెట్టి కాంతార 2 ని నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.







