కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్( Shiva Rajkumar ) హీరోగా రూపొందిన తాజా చిత్రం ఘోస్ట్. ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ విషయం లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే దసరా కి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.కన్నడం లో శివ రాజ్ కుమార్ యొక్క స్థాయి మరియు స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కానీ తెలుగు మరియు తమిళం లో మాత్రం ఆయన సినిమా లకు పెద్దగా బజ్ ఉండదు.కానీ తాజా చిత్రం ఘోస్ట్ ( Ghost )విషయం లో సీన్ రివర్స్ అయింది.
తమిళ్ లో ఈ సినిమా ను దాదాపుగా 5 కోట్ల కు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేయడం జరిగిందట.
ఇక తెలుగు లో ఈ సినిమా ను కాస్త తక్కువ 10 కోట్ల రూపాయలకు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేయడం జరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.మొత్తానికి శివ రాజ్ కుమార్ యొక్క ఘోస్ట్ సినిమా( Ghost ) తెలుగు లో బాగానే రాబడుతుందని బయ్యర్లు భావిస్తున్నట్లుగా ఉన్నారు.అందుకే దాదాపుగా పది కోట్ల రూపాయలను ఖర్చు చేసి కొనుగోలు చేశారు.
అంటే తెలుగు రాష్ట్రాల్లో ఘోస్ట్ సినిమా ఏకంగా 12 నుంచి 13 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది.దసరా కానుకగా విడుదల కాబోతున్న సినిమా అవ్వడం తో సెలవులు కలిసి వచ్చి కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావిస్తున్నారు.
గతంలో శివ రాజ్ కుమార్ నటించిన ఒకటి రెండు సినిమా లు తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
కనుక ఇప్పుడు అదే విధంగా ఈ సినిమా లు కూడా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అందుకే కన్నడం లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఘోస్ట్( Ghost ) కి మంచి బిజినెస్ జరిగింది.పదే పదే ఈ సినిమా గురించి మీడియాలో ప్రచారం జరగడంతో పాటు ఘోస్ట్ టైటిల్ తో గతంలో నాగ్ సినిమా రావడం వల్ల అంచనాలు పెరిగాయి.
మరి అంచనాలను అందుకుని బ్రేక్ ఈవెన్ వసూళ్లను ఘోస్ట్ దక్కించుకుంటుందా చూడాలి అంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.