తెలుగుతో పాటు ఇతర భాషల్లో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఊహించని స్థాయిలో సక్సెస్ అయిందనే సంగతి తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సోను శ్రీనివాస్( Sonu Srinivas ) కన్నడ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు.
రైచూర్ లోని ఒక జంట దగ్గర సోనూ శ్రీనివాస్ 8 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారిని దత్తత తీసుకున్నారని సమాచారం అందుతోంది.
అయితే సోనూ శ్రీనివాస్ చిన్నారిని దత్తత తీసుకున్న తర్వాత ఆ చిన్నారితో కలిసి సోషల్ మీడియా వేదికగా రీల్స్ ను ( Reels ) షేర్ చేయడం జరిగింది.
సోషల్ మీడియాలో పాపకు సంబంధించిన ఫోటోలను సైతం ఆమె పంచుకున్నారు.అయితే చిన్నారిని దత్తత తీసుకోవడం గురించి సోనూ శ్రీనివాస్ పై పాజిటివ్ కామెంట్లు వినిపించినా చిన్నారితో రీల్స్ చేయించడంపై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

ఈ విషయాలు చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి రాగా బైదరహళ్లి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.దత్తతకు సంబంధించి సోనూ శ్రీనివాస్ నియమ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అవ్వాలనే ఆలోచనతో సోనూ శ్రీనివాస్ చిన్నారిని దత్తత తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.సోనూ శ్రీనివాస్ అరెస్ట్( Sonu Srinivas Arrest ) నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.సోనూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సైతం ఆమె అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు.సోనూ శ్రీనివాస్ చేసింది ముమ్మాటికీ తప్పేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.చిన్నారితో రీల్స్ చేయకుండా ఉండి ఉంటే సోనూ శ్రీనివాస్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పవచ్చు.