ఏపీ బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మి నారాయణ ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి కన్నా ఇచ్చిన షాక్ గట్టిగానే తాకిందనే చెప్పాలి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించి బీజేపీలోని అంతర్మథనంను బయట పెట్టాడు.దీంతో ఆ పార్టీలోని జీవిఎల్ నరసింహారావు వంటి వాళ్ళు కన్నా పై గట్టిగానే విమర్శలు చేశారు.
అయినప్పటికి కన్నా దారిలోనే మరికొంత మంది బీజేపీ నేతలు పార్టీ వీడుతున్నట్లు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంచితే బీజేపీ నుంచి బయ్తకు వచ్చిన కన్నా లక్ష్మి నారాయణ టీడీపీ గూటికి చేరారు.
అయితే ఆయన మొదటి జనసేన తీర్థం పుచ్చుకొనున్నారనే వార్తలు వచ్చినప్పటికి.ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపారు.నేడు చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.కన్నా లాంటి రాజకీయ నేతలు టీడీపీలో చేరడం శుభపరిణామం అని చంద్రబాబు కన్నా లక్ష్మి నారాయణపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఇదిలా ఉంచితే కన్నా లక్ష్మినారాయణ అనుకున్నట్లుగానే టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన చేరికతో టీడీపీ శ్రేణుల్లో హ్యాపీ నెస్ కనిపిస్తుంటే బీజేపీలో మాత్రం ఆందోళన కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే 2014 ఎన్నికల తరువాత బీజేపీ, టీడీపీ మద్య దూరం పెరిగింది.
ఆ దూరం కాస్త గత ఎన్నికల ముందు వైరంగా మారింది.మోడి అమిత్ షా లపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈసారి చంద్రబాబుతో చేతులు కలపడానికి ససేమిరా అంటోంది బీజేపీ అధిష్టానం.ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీలోని ఆయా నేతలను కన్నా లక్ష్మినారాయణ ద్వారా టీడీపీలోకి రెడ్ కార్పెట్ వేయడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.ఇదే ప్రస్తుతం కమలనాథులను కలవర పెడుతున్న అంశం.
మరి చంద్రబాబు తన చతురత ఉపయోగించి మరింత మంది బీజేపీ నేతలను ఆకర్షిస్తే. బీజేపీకి టీడీపీతో చేతులు కలపడం తప్పా వేరే దారి ఉండదనేది మరికొందరి వాదన.
మొత్తానికి కన్నా టీడీపీ ఎంట్రీ తో చంద్రబాబు విషయంలో బీజేపీ అధిష్టానం డిఫెన్స్ లో ఉందనే చెప్పాలి.