తారకరత్న మరణాన్ని తలచుకుని ఆయన అభిమానులు ఇప్పటికీ బాధ పడుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్నకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఆయన కోచ్ పేరు విజయ్ శేఖర్ కాగా ఈయన దగ్గర తారకరత్న సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారని సమాచారం అందుతోంది.ఫోన్ ద్వారా తారకరత్నతో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు.
2008 సంవత్సరం సమయంలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరిగిందని విజయ్ శేఖర్ అన్నారు.తారకరత్నకు క్రమశిక్షణ ఎక్కువని టైమింగ్ ను ఆయన ఫాలో అయ్యేవారని విజయ్ శేఖర్ చెప్పుకొచ్చారు.
అలసిపోయానని ఆయన చెప్పేవారు కాదని విజయ్ శేఖర్ కామెంట్లు చేశారు.సినిమాలను కూడా చాలా కమిట్మెంట్ తో ఆయన చేసేవారని విజయ్ శేఖర్ వెల్లడించడం గమనార్హం.ప్రొఫెషనల్ కోచింగ్ కు ఆయన ఇష్టపడ్డారని ఆయన తెలిపారు.

రెండు నెలల పాటు తారకరత్న శిక్షణ తీసుకున్నారని ఆయన చాలా సింపుల్ గా ఉండేవారని సేఫ్టీ టిప్స్ ను ఆయన ఎంతగానో ఫాలో అయ్యేవారని విజయ్ శేఖర్ చెప్పుకొచ్చారు.అమ్మాయిలతో అమ్మ అమ్మ అని ఆయన మాట్లాడేవారని విజయ్ శేఖర్ పేర్కొన్నారు.అభిమానులకు కూడా ఆయన ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారని ఎంతగానో రెస్పెక్ట్ ఇచ్చేవారని ఆయన వెల్లడించడం గమనార్హం.

హైదరాబాద్ కు వచ్చేయండి సార్ అని నాతో చెప్పేవారని విజయ్ శేఖర్ అన్నారు.తర్వాత రోజుల్లో ఆఫర్లు తగ్గడంతో ఆయన ఫేస్ లో డిప్రెషన్ కనిపించేదని విజయ్ శేఖర్ వెల్లడించడం గమనార్హం.డిప్రెషన్, స్ట్రెస్ వల్ల ఎఫెక్ట్ పడిందని సినిమాలు సరిగ్గా ఆడకపోవడం ఆయన కెరీర్ పై ప్రభావం చూపిందని విజయ్ శేఖర్ అన్నారు.ఆ తర్వాత రోజుల్లో మేము టచ్ లో ఉండేవాళ్లమని విజయ్ శేఖర్ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులలా ఆయన అందరినీ ట్రీట్ చేస్తాడని విజయ్ శేఖర్ కామెంట్లు చేశారు.







