Surya : చివరి దశకు చేరుకున్న హీరో సూర్య మూవీ.. థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తూ అలా?

తమిళ హీరో సూర్య( hero Surya ) గురించి మనందరికీ తెలిసిందే.సూర్య తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంటాయి.ఎప్పుడు కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సూర్య.

ఈ నేపథ్యంలోనే హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువ( Kanguva ).ఈ సినిమాకు డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది తెరకెక్కబోతోంది.

అంతేకాకుండా ఈ మూవీ సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

Advertisement

ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ను థాయిలాండ్( Thailand ) లోని అడవుల్లో చిత్రీకరించనున్నారు.అయితే ఇందుకోసం ఇప్పటికే చిత్రబృందం అక్కడకు చేరుకుంది.

కాగా ఆ షెడ్యూల్‌ దాదాపుగా నెల రోజుల పాటు కొనసాగనుంది.సినిమాలోని కీలక సన్నివేశాలను ఇందులో చిత్రీకరించనున్నారు.

ఇక హీరో సూర్య థాయిలాండ్ లోని అక్కడి ప్రదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు( UV Creations , Studio Green ) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇందులో సూర్య సరసన దిశా పటాని నటిస్తోంది.ఇది ఆమెకు తొలి తమిళ సినిమా కావడం విశేషం.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.దీన్ని త్రీడీలో 10కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తవ్వగానే దర్శకురాలు సుధ కొంగరతో చేయనున్న సినిమాలో సూర్య జాయిన్‌ కానున్నారు.గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆకాశం నీ హద్దురా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి.

తాజా వార్తలు