హాట్ బ్యూటితో కలిసి నటించబోతున్న ధోని - కొహ్లి

మీరు విన్నది నిజమే.

భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ కలిసి ఒక హాట్ హీరోయిన్ తో కలిసి నటించనున్నారు.

బుద్ధిగా క్రికెట్ ఆడుకోక, ఈ నటన లాంటి అవసరంలేని పనులు ఎందుకు అని తిట్టుకోకండి.వాళ్ళు సినిమాలో నటించట్లేదు.

కేవలం ఒక యాడ్ కోసం మేకప్ వేసుకోనున్నారు.ఇంతకీ ఏ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నారో చెప్పనే లేదు కదూ! బాలివుడ్ ఫీమేల్ సూపర్ స్టార్ కంగన రనౌత్ తో.ఈ యాడ్ కి దర్శకత్వం వహించబోయేది ఎవరో తెలుసా .3 ఇడియట్స్, పీకే చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాని.ఏప్రిల్ 7న ఈ యాడ్ ని షూట్ చేస్తారు.

ఐపియల్ ప్రారంభం అవుతోంది కదా ఎల్లుండి నుంచి .అందుకే ఈ తతంగం అంతా.ఇది చాలా కాస్ట్లీ యాడ్ అంటా.

Advertisement

ఖర్చవదా మరి ! ధోని,విరాట్ కొహ్లి, కంగనా రనౌత్ .ఇలాంటి స్టార్లని ఒకే ఫ్రేమ్ లో చూపించాలి.మళ్ళీ వీరిని డైరెక్ట్ చేసేది కూడా రాజ్ కుమార్ హిరాని లాంటి స్టార్ డైరెక్టర్.

మరి మన స్టార్ క్రికేటర్లు, ఒక స్టార్ హీరోయిన్ తో నటనలో బాగానే పోటిపడ్డారో, లేక కంగన నటన ముందు చతికిల పడ్డారో త్వరలోనే టీవిలో చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు