Kangana Ranaut : ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని మాత్రం చెయ్యను.. కంగనా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కంగనా రనౌత్( Kangana Ranaut ) ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో తెలుగు సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Kangana Ranaut Special Pist Goes Viral On Social Media-TeluguStop.com

ఇటీవల ఎమర్జెన్సీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా కంగనా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ పోస్టులో భాగంగా కంగనా తనని తాను ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్( Lata Mangeshkar ) తో పోల్చుకున్నారు.డబ్బుల కోసం నేను పెళ్లిలో డాన్సులు చేయనని తెలిపారు.

నాకు డబ్బు కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు.అయితే లతా మంగేష్కర్ కూడా ఇలాంటి కార్యక్రమాలలో డబ్బుల కోసం పాటలు పాడనని ఈమె గతంలో తెలిపారు.

ఈ క్రమంలోనే కంగనా తనని లతా మంగేష్కర్ తో పోల్చుకున్నారు.

ఈ విధంగా డబ్బు కోసం నేను డాన్స్లు చేయను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇటీవల అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Marchent ) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ పెద్ద ఎత్తున డాన్సులు చేసిన సంగతి తెలిసిందే.అయితే వారందరూ డబ్బు తీసుకునే డ్యాన్సులు చేశారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నటువంటి తరుణంలో కంగనా ఈ విధంగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.

ఇక ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ పై పలువురు స్పందిస్తూ మద్దతు తెలుపగా మరికొందరు ఈమె పోస్ట్ పై విమర్శలు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల కాలంలో కంగనా బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాల పైన ఆసక్తి చూపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube