బాలీవుడ్ నటీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి బాలీవుడ్ సెలబ్రిటీల పై షాకింగ్ కామెంట్స్ చేసింది.కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ధాకడ్.
ఈ సినిమాతో త్వరలోనే కంగనారనౌత్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో ఆమె యాక్షన్ స్టార్ అలరించబోతున్నారు విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
ఆదివారం వేళలో కంగానా ఇంట్లో అతిథులుగా భోజనం చేయాల్సి వస్తే ఆ అవకాశం బాలీవుడ్ లో ఏ ముగ్గురికి దక్కుతుంది అని ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన కంగానా తన ఇంటికి వచ్చి విందులో పాల్గొని అంత విలువ బాలీవుడ్ సినీ రంగంలో ఎవరికీ లేదని తెలిపింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో ఫ్రెండ్స్ లేరా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.లేరు అంటూ బదులిచ్చింది.అంతే కాకుండా తన తో దోస్తీ చేయాలి అంటే అందుకు తగిన అర్హత కావాలని,ఆ అర్హత బాలీవుడ్ సినీ రంగంలో ఏ ఒక్కరికి కూడా లేదని తెలిపింది.అంతేకాకుండా హిందీలో తన ఇంట్లో కాలుమోపే అర్హత గల సెలబ్రిటీలు ఒక్కరు కూడా కూడా లేరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది కంగనా.
ఇకపోతే కంగానా నటించిన ధాకడ్ ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇందులో దివ్య దత్తా, షరీబ్ హష్మీ, శాశ్వత చటర్జీ కీలక పాత్రలో నటించారు.
ఈసినిమాకు రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.







