బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్( Kangana Ranauth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కంగనా.ఏ విషయాన్ని అయినా కూడా కుండలు బద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పేస్తూ ఉంటుంది.
దాంతో ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.కాగా కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కంగానా ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో అయినా రణ్‌బీర్ కపూర్‌ను( Ranbir Kapoor ) దుర్యోధనునితో పోలుస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.అంతేకాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ను( Karan Johar ) శకునిగా అభివర్ణించింది.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajputh )ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది.
కంగనా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి.అయితే ఈ దుర్యోధనుడు,శకుని జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి.వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు.
బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే.అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే.నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు.
నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి అంటూ రాసుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
మరి తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రణ్‌బీర్ కపూర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.కాగా ఒకవైపు కాంట్రవర్సీలలో నిలుస్తూనే మరొకవైపు వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది కంగాన.







