60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న కంచరపాలెం పోలీసులు కప్పరాడ పెద్ద కొత్తూరు వద్ద ఒక కారు పార్కింగ్ చేసి గంజాయి తరలిస్తున్న క్రమంలో దాడి చేసిన కంచరపాలెం పోలీసులు… 30 ప్యాకెట్ల లో వున్న 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఒక కారును సీజ్ చేసిన పోలీసులు ….గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు పరారు కాగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.







