యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్
సుదీర్ఘ కాలం పాటు నిన్నటి తరం హీరోయిన్
గౌతమి
తో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే.పెళ్లి చేసుకోకున్నా కూడా ఇద్దరు అధికారికంగా చాలా ఏళ్లు కలిసే ఉన్నారు.
కమల్ బిజినెస్ వ్యవహారాలు సినిమా విషయాలను గౌతమి చూసుకునేది.అయితే వీరిద్దరి మద్య
శృతిహాసన్
కారణంగా గొడవలు వచ్చాయని, దాంతో ఇద్దరు కూడా విడిపోయారు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.
అప్పటి నుండి మళ్లీ వీరి గురించి ఎలాంటి వార్తలు లేవు.కాని కరోనా కారణంగా వీరిద్దరు వార్తల్లో నిలిచారు.

రెండు రోజుల క్రితం
చెన్నైలోని కమల్ హాసన్ ఇంటికి ఈ ఇల్లు క్వారంటైన్లో ఉంది
కనుక ఎవరు రావడం కాని పోవడం కాని చేయకూడదు.ఈ ఇంటికి చెందిన వారు ఎవరు బయటకు వెళ్ల కూడదు అంటూ నోటీసులు అంటించడం జరిగింది.దాంతో కమల్‌కు కరోనా సోకిందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమయంలోనే గందరగోళ వాతావరణం ఏర్పడటంతో కమల్ హాసన్ స్పందించాడు.అసలు ఎలాంటి అనారోగ్యం తనకు లేదని క్లారిటీ ఇచ్చాడు.
అసలు విషయం ఏంటీ అంటే రెండు వారాల క్రితం
గౌతమి
విదేశాలకు వెళ్లి వచ్చిందట.
ఆమె పాస్ పోర్ట్‌లో ఉన్న అడ్రస్‌కు కరోనా క్వారంటైన్ పోస్టర్‌ను అతికించారు.అప్పట్లో గౌతమి పాస్ పోర్ట్ కోసం కమల్ ఇంటి అడ్రస్‌ను ఇచ్చిందట.అందుకే ఆమె కారణంగా కమల్ ఇంటికి నోటీసులు అంటించడం జరిగిందని అధికారులు అంటున్నారు.ఈ విషయమై గౌతమి ఎలా స్పందిస్తుందో చూడాలి.