కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్( Rajinikanth Kamal Haasan ) కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఈ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
రజనీకాంత్, కమల్ హాసన్ లకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉంది.రజనీకాంత్ తో ఫ్రెండ్ షిప్ ను ఉద్దేశిస్తూ కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

విక్రమ్ సినిమాకు కోలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్( SIIMA Award ) ను సొంతం చేసుకున్న కమల్ హాసన్( Kamal Haasan ) మాట్లాడుతూ లోకేశ్ కనగరాజ్ నాకు వీరాభిమాని అని అన్నారు.ఈ మధ్య కాలంలో లోకేశ్ రజనీకాంత్ తో ఒక సినిమాను ప్లాన్ చేశానని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో కొంతమంది రజనీకాంత్ తో నా వీరాభిమాని సినిమాచేయడం ఏంటని కామెంట్ చేశారని అయితే సాధారణ ప్రేక్షకులకు అది మాత్రమే తెలుసని కమల్ అన్నారు.
రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్( Lokesh Kanagaraj ) లో సినిమా రావడం నాకు సంతోషాన్ని కలిగించిందని కమల్ చెప్పుకొచ్చారు.ఈ విషయంలో నేను గర్విస్తున్నానని ఆయన తెలిపారు.15 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో రజనీతో స్నేహ బంధం గురించి మాట్లాడానని కమల్ పేర్కొన్నారు.నేను రజనీ లాంటి స్నేహితులు అప్పటి తరంలో ఎవరూ లేరని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో కూడా పోటీ ఉండేదని కమల్ హాసన్ అన్నారు.నాకు రజనీకాంత్( Rajinikanth ) కు మధ్య పోటీ ఉండేదని అయితే ఆ పోటీ ద్వేషంతో కూడా ఆరోగ్యకరంగా ఉండేదని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.అందువల్లే మేము ఈ స్థాయికి చేరుకున్నామని కమల్ హాసన్ కామెంట్లు చేశారు.
రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







