రామ్ చరణ్ చేతుల మీదుగా కమల్ హాసన్ విక్రమ్ తెలుగు ట్రైలర్ లాంచ్!

లోకనాయకుడు లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలకానుంది.

 Kamal Haasan Vikram Telugu Trailer Launch By Ram Charan , Ram Charan , Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు.

తెలుగులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొంటున్నారు.

కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్ వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది.ఈ ట్రైలర్ నేడు (మే 20) సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయనున్నారు.

Telugu Nitin, Kamal Haasan, Ram Charan, Telugu, Tollywood, Vikram-Movie

ఇక ఈ సినిమాని తెలుగులో యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంలో విడుదల చేయనున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ కథలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ పజిల్ ప్రధాన పాత్రలలో నటించగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీత దర్శకత్వం వహించారు.ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube