రామ్ చరణ్ చేతుల మీదుగా కమల్ హాసన్ విక్రమ్ తెలుగు ట్రైలర్ లాంచ్!

లోకనాయకుడు లెజెండరీ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలకానుంది.

ఇక ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు.

తెలుగులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొంటున్నారు.

కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్ వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది.

ఈ ట్రైలర్ నేడు (మే 20) సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయనున్నారు.

"""/"/ ఇక ఈ సినిమాని తెలుగులో యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంలో విడుదల చేయనున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ కథలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ పజిల్ ప్రధాన పాత్రలలో నటించగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో సందడి చేయనున్నారు.

ఇక ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీత దర్శకత్వం వహించారు.

ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎలాంటి క్రీమ్స్ అక్కర్లేదు.. ఈ ఒక్క ఆయిల్ ను వాడారంటే మచ్చలు పోయి మీ ముఖం వైట్ గా మారడం ఖాయం!