విక్రమ్ 2 పై క్రేజీ అప్డేట్.. సీక్వెల్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట ?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.ఈయన తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.

 Kamal Haasan Vikram 2 Already On The Cards, Vikram, Universal Star, Kamal Hassan-TeluguStop.com

అందుకే ప్రేక్షకుల చేత లోకనాయకుడు అని కూడా పిలుపించు కుంటాడు.చాలా రోజులుగా ఫామ్ లో లేకపోయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.ఈ డైరెక్టర్ కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.

Telugu Kamalhaasan, Kamal Hassan, Vikram, Vikram Sequel-Movie

వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు. జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో హిట్ మూవీగా డిసైడ్ చేసేసారు.అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటుంది అని డైరెక్టర్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

విక్రమ్ సినిమా హిట్ అవ్వడంతో సీక్వెల్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.అయితే ఈ ఆసక్తికర సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అప్పుడే తింకడం మొదలు పెట్టారు అభిమానులు.

ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కొద్దీ సమయం ఉండదా.డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, హీరో కమల్ హాసన్ ఇద్దరు కూడా విడివిడిగా ఒక్కో సినిమా చేయనున్నారట.ఆ సినిమాలు పూర్తి అయినా తర్వాత అప్పుడు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారని అందుకు దాదాపు ఏడాది సమయం పట్టనుందని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube