తమిళ దర్శక దిగ్గజం శంకర్ రోబో సీక్వెల్ తర్వాత భారతీయుడు సినిమా సీక్వెల్ కి సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆరంభం అయ్యింది.
అయితే మధ్య కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది.ఇంతలో కమల్ హసన్ తమిళ రాజకీయాలలో బిజీ అయిపోయారు.
ప్రస్తుతం లోక్ సభ బరిలో దిగుతున్న కమల్ హసన్ పార్టీ ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టింది.
ఇక కమల్ హసన్ కూడా రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలపై పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టలేకపోతున్నా అని స్పష్టం చేసాడు.
తాజాగా తాను సినిమాలు ఆపేస్తున్నా అని, తన అభిమానులు క్షమించాలని కమల్ హసన్ కోరాడు.రాజకీయాలు, సినిమా రెండింటిని సమన్వయం చేయడం కష్టంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసారు.
ఇప్పుడు కమల్ హసన్ తాజా నిర్ణయం ఊహించని విధంగా భారతీయుడు మీద పడుతుందా అనే అనుమానం సినిమా వర్గాలలో తలెత్తింది.ఇక శంకర్ కూడా కమల్ ఆకస్మిక నిర్ణయంతో కంగుతిన్నట్లు తెలుస్తుంది.
అయితే భారతీయుడు ఫినిష్ చేసి తరువాత పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీ కావాలని కమల్ ఆలోచనగా తెలుస్తుంది.