'ప్రాజెక్ట్ కే'పై కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు భారీ లైనప్ ఉన్న విషయం తెలిసిందే.ఈయన లైనప్ లో ఇటీవలే ఆదిపురుష్( Adipurush ) రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఆ నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ కే( Salar, Project K ) ఉన్నాయి.

 Kamal Haasan On Being Part Of Project K , Prabhas, Project K, Deepika Padukone,-TeluguStop.com

మరి ప్రాజెక్ట్ కే మీద భారీ అంచనాలను సెట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారని నిన్న అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది.దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్కసారిగా ఈ అనౌన్స్ మెంట్ ప్రకంపనలు రేపింది అనే చెప్పాలి.

ఈ విషయంలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ నా కల నెరవేరింది అంటూ కమల్ హాసన్ తో నటించడంపై పోస్ట్ షేర్ చేసారు.

Telugu Kamal Haasan, Kamalhaasan, Nag Ashwin, Prabhas, Project-Movie

ఇక ఇప్పుడు కమల్ హాసన్( Kamal Haasan ) ప్రాజెక్ట్ కే లో భాగం కావడంపై ఆయన కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.”50 ఏళ్ల క్రితం డాన్స్ అసిస్టెంట్ గా నేను నా ప్రస్థానం స్టార్ట్ చేయగా అప్పట్లో నిర్మాతగా అశ్వినీదత్ పేరు బలంగా వినిపించేది.ఇప్పుడు అదే నిర్మాతతో 50 ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నాను.

ఇక నాగ్ అశ్విన్ ఒక మేధావి.ఈ సినిమా కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా.

Telugu Kamal Haasan, Kamalhaasan, Nag Ashwin, Prabhas, Project-Movie

ప్రేక్షకులకు నా నటనలో నాణ్యమైన ఉత్తమమైన నటన కనబర్చడమే నా తొలి కర్తవ్యం.నేను ఒక సినిమా పిచోడ్ని.అందుకే ఏ కొత్త ప్రయత్నం వచ్చిన నా దృష్టికి నేను వెంటనే అభినందిస్తాను.ఇప్పుడు ప్రాజెక్ట్ కే( Project K ) కూడా ముందుగా నేను అభినందించాలి అనుకుంటున్నా.

ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, అమితాబ్ తో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్న.వారితో ఎంజాయ్ చేస్తాను.ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం” అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube