సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇప్పటికే కేపీ చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయనను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ లింకులపై పోలీసులు కూపీ లాగుతున్నారు.కేపీ చౌదరి విచారణతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.
కేపీ చౌదరి కాల్ లిస్టును పరిశీలించిన పోలీసులు కొందరు వందసార్లకు పైగా మాట్లాడినట్లు గుర్తించారు.ఈ క్రమంలో 12 మందికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించనున్నారని సమాచారం.
మరోవైపు కేపీ చౌదరి ఆరోపణలపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు.డ్రగ్స్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని తెలిపారు.







