కమల్-మణిరత్నం మూవీ అప్డేట్.. ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే?

విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఎన్నో ఏళ్ల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తో అలాంటి హిట్ కొట్టడంతో ఈయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

 Kamal Haasan - Mani Ratnam Reunite On 'kh234', Kh234, Kamal Haasan, Mani Ratnam,-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు.కమల్ హాసన్ ప్రెజెంట్ ”ఇండియన్ 2” సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కమల్ కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాలి.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Telugu Indian, Kamal Haasan, Kamalhaasan, Kh, Kollywood, Mani Ratnam, Ponniyin S

ఇక ఈ సినిమా తర్వాత కమల్ లైనప్ లో భారీ సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు.ఈయన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో చాలా ఏళ్ల తర్వాత మరో సినిమా చేయబోతున్నాడు.కమల్ హాసన్ కెరీర్ లో 234వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.ఈసారి మణిరత్నం చారిత్రాత్మక కథ కాకుండా సోషల్ మెసేజ్ తో తెరకెక్కనుందని సమాచారం.

Telugu Indian, Kamal Haasan, Kamalhaasan, Kh, Kollywood, Mani Ratnam, Ponniyin S

తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారసులు ఎలా ఉండాలి? అనే అంశం మీద మణిరత్నం ఈ సినిమా కథ నడిపించ బోతున్నారని ఈ ఏడాది నవంబర్ నుండి షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.ఇక ఈ సినిమా సహ నిర్మాతలలో కమల్ కూడా ఉన్నారు.ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్టు తెలిసింది.ప్రెజెంట్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండగా.కమల్ ఇండియన్ 2 మూవీ షూట్ తో బిజీగా ఉన్నాడు.మరి అనుకున్న సమయానికి ఈ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube