యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఇండియన్ 2 షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఇప్పటి వరకు సినిమా విడుదల విషయం లో మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.దాంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు అంటూ నెటిజన్స్ తో పాటు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఇండియన్ 2 సినిమా( Indian 2 Movie ) లో కమల్ యొక్క పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.

గతంలో భారతీయుడు సినిమా( Bharateeyudu ) లో సేనాపతి పాత్ర ని తీసుకున్నా కూడా ఇంకాస్త విభిన్నంగా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు అంటున్నారు.మొత్తానికి కమల్ హాసన్ యొక్క ఇండియన్ 2 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమా తమిళం లో రూపొందినా కూడా మొత్తం ఇండియన్ సినీ భాషల ప్రేక్షకులు ఇంకా ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ 2 సినిమా కు శంకర్ దర్శకత్వం వహిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా శంకర్( Director Shankar ) బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ముగిస్తున్నాడు.ఇటీవలే విదేశీ షెడ్యూల్ ను ముగించిన దర్శకుడు శంకర్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.వచ్చే నెలలో మళ్లీ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అంటున్నారు.
ఆ షెడ్యూల్ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.ఇక కమల్ హాసన్ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి.
ఇండియన్ 2 సినిమా కనుక భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ముందు ముందు శంకర్ మరియు కమల్ హాసన్ ల కాంబోలో మరిన్ని సినిమా లు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.







