లెజెండరీ డైరెక్టర్ కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు.విక్రమ్ సినిమా ద్వారా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
గత కొన్ని సంవత్సరాల క్రితం భారతీయుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు.

ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత కొన్ని ప్రమాదాలు జరగడంతో పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి.అయితే ఈ వివాదాల కారణంగా కొంతకాలం పాటు ఈ సినిమాని వాయిదా వేశారు.ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ హీరోగా మరొక పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యారు.ఇక ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఇండియన్ 2 సినిమాకు చుట్టుకున్నటువంటి వివాదాలు తొలగిపోవడంతో తిరిగి శంకర్ ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల సైతం కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి కమల్ హాసన్ బిగ్ అప్డేట్ ఇస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు.ఈ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసినటువంటి కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కోసం రాత్రి పగలు కష్టపడుతూ శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నామని త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము అంటూ ఈయన అప్డేట్ ఇచ్చారు.ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియగానే ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని భావించిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







