19 ఏళ్ల వయసులో కమల్ హాసన్( Kamal Haasan ) మొట్టమొదటి సారి నటి శ్రీవిద్యను( Srividya ) కలిసాడట.అప్పటికే ఆమె కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కమల్ హాసన్ మాత్రం అప్పుడప్పుడే నటుడుగా ఎదుగుతున్నాడు.ఎలా మొదలైందో ఏమో తెలియదు కానీ మొట్టమొదటి సినిమాతోనే కమల్ హాసన్, శ్రీ విద్యా ప్రేమలో పడ్డాడు.
ఆ ప్రేమ ఆమె చనిపోయేంత వరకు కూడా కొనసాగింది అంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఎమోషనల్ గా తెలపడం విశేషం.
కొన్ని ప్రేమకథలు( Love Story ) పెళ్లితో అంతం కావు అని, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్న తన మనసులో ఒకరికి స్థానం అనేది ఎప్పుడూ ఉంటుందని, ఆ ఒక్కరు శ్రీవిద్య మాత్రమే అంటూ కమల్ తెలిపారు.శ్రీవిద్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో అన్ని రకాల బాధలు అనుభవించి చివరికి క్యాన్సర్ తో( Cancer ) మృత్యువుతో పోరాడుతున్న సమయంలో కోరుకున్న ఏకైక కోరిక కమల్ తో చివరి క్షణాలు గడపాలని తనతో చివరి శ్వాస వరకు ఉండాలని.
ఆమె కోరికకు కమల్ హాసన్ ఓకే చెప్పి ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమెతోనే గడిపాడు.తనపై నా ప్రేమ ఎప్పటికీ ఉంటుందని శ్రీవిద్యను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదని కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు.కానీ ఆ తర్వాత ఏ పెళ్లి ( Marriage ) కూడా తనకు వర్క్ అవుట్ అవ్వలేదని ఇప్పటికీ తన మనసులో శ్రీవిద్య కు స్థానం ఉంటుందని కమల్ హాసన్ చెబుతున్నాడు.
నిజంగా కమల్ జీవితంలో ఎంతో మంది ఆడ వారికి స్థానం ఉంది.
పెళ్లిళ్లు కూడా ఒకటికి మించి చేసుకున్న వ్యక్తి.కానీ అతడు కూడా ఒక వ్యక్తి పట్ల లేదా ఒక మహిళ పట్ల ఇంతటి ప్రేమను కురిపిస్తాడని ఎవరు అనుకోరు.కమల్ హాసన్ జీవితంలో ఎంతో మంది మహిళలు వస్తున్నారు పోతున్నారు.
కానీ ఎప్పటికీ నిలిచిపోయిన స్థానం శ్రీవిద్య ది మాత్రమే అని చెప్పడం ఎంతో మందిని కదిలిస్తోంది.కమల్ హాసన్ లో ఇలాంటి ఒక ప్రేమ ఊహించడం నిజంగా గొప్ప విషయమే ఇప్పటికీ తన జీవితంలో ఒంటరిగానే ఉన్నాడు.
ఇకపై కూడా ఒంటరి గానే ఉంటానని చెబుతున్నాడు
.