కళ్యాణ్ రామ్ మూవీ ఒక్క సాంగ్ కోసం అన్ని రూ.కోట్ల ఖర్చా.. రేంజ్ మారిందంటూ?

నందమూరి హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్( Kalyan Ram )సినిమాకు హిట్ టాక్ వస్తే భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి.బింబిసార సినిమా( Bimbisara ) కళ్యాణ్ రామ్ కు భారీ రేంజ్ లో లాభాలను మిగల్చగా అమిగోస్ సినిమా మాత్రం భారీ నష్టాలను మిగల్చడం గమనార్హం.

 Kalyan Ram Shocking Decision Details Here Goes Viral In Social Media,kalyan Ram,-TeluguStop.com

బింబిసార ఫస్ట్ డే కలెక్షన్లను అమిగోస్ ఫుల్ రన్ లో బ్రేక్ చేయలేదనే సంగతి తెలిసిందే.

అయితే అమిగోస్( Amigos ) సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న డెవిల్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కళ్యాణ్ రామ్ మార్కెట్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సాంగ్ కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సాంగ్ అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ, మాటలు అందించగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే ఇండియన్ స్పై రోల్( Indian Spy Role ) లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.అభిషేక్ నామా ఈ సినిమాకు నిర్మాత కాగా ఖర్చు విషయంలో ఆయన రాజీ పడటం లేదు.

కళ్యాణ్ రామ్ బింబిసార2( Bimbisara2 ) సినిమాకు డైరెక్టర్ మారారని ఇండస్ట్రీలో వినిపిస్తుండగా ఈ ప్రచారంలో స్పష్టత రావాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ కు డెవిల్ సినిమా( Devil ) సక్సెస్ సాధించడం కెరీర్ పరంగా కీలకమని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube